పుట:Sri-Srinivasa-Ayengar.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


నివాసమేర్పఱచుకొనిరి. అడ్వకేటు జనరల్‌పదవిలో నున్నపుడు సర్. శ్రీ పి. యస్. శివస్వామి అయ్యరుగారు లజ్‌రోడ్డునందే వసించుచుండిరి. అమీద శ్రీ టి. ఆర్ . వేంకటరామశాస్త్రి, సర్. శ్రీ కె. శ్రీనివాసఅయ్యంగారు ఈరోడ్డునందలి బంగాళాలలో వాసముచేయుచు హైకోర్టున న్యాయవాదులలో ప్రముఖులుగ నుండిరి. శ్రీమా౯గారు మైలాపూరు వకీళ్లలో నగ్రస్థానము సంపాదింపగల్గిరని యిదివరలో చెప్పియుంటిని. శ్రీమా౯గారి సోదరుఁడు శ్రీ. యస్. వెంకటేశఅయ్యంగారు, సర్. కె. శ్రీనివాసఅయ్యంగారి అల్లుడాయెను. సర్. కె. శ్రీనివాసఅయ్యంగారు గవర్నరు కౌన్సిలుమెంబరు కాగానే సర్. శ్రీ అల్లాడి కృష్ణస్వామయ్యగారు లజ్‌చర్చిరోడ్డున నొకబంగళా నిర్మించుకొని అందుఁజేరిరి. లజ్‌చర్చిరోడ్డున ఎందరో ప్రముఖులు వాసమున్నందుచే అనేకులు పనులమీద ఈప్రదేశమునకు వచ్చెడివారు. ఒకరివెంబడి ఒకరు అడ్వకేటు జనరల్ పదవిని స్వీకరించిరి కావున (సర్. శ్రీ వి. భాష్యంఅయ్యంగారు, శ్రీమా౯ ఎస్. శ్రీనివాసఅయ్యంగారు. సర్ . శ్రీ కె. శ్రీనివాసఅయ్యంగారు), ఈరోడ్డుప్రాముఖ్యత రానురాను అతిశయించెను.