పుట:Sri-Srinivasa-Ayengar.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

41


యింటినుండి బయటికి వెళ్లుటకు స్త్రీలు, పిల్లలు భయపడెడివారు. శ్రీమా౯గారి తోటలో పాములనేకములుండెను గావున పారానౌకర్లకు రాత్రులలో వీనిని చంపుటతప్ప వేరొకపని యుండెడిదికాదు. వర్షాకాలమున కప్పలకూతలు హెచ్చుగనుండెడివి. అయితే లజ్ రోడ్డునకు అప్పుడేగాక యిప్పుడుగూడ నొకమోస్తరు ప్రాముఖ్యత యేర్పడియున్నది. ప్రముఖులును అపారధనవంతులును ఈరోడ్డునందే వసించెడివారు. రాజా, సర్. టి. మాధవరావు: సర్. శ్రీ వి. భాష్యంఅయ్యంగారు, Dary house (ప్యారీకంపెని) శ్రీ వేంకటస్వామినాయుడుగారు శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరు మున్నగువారందఱును ఈరోడ్డునందలి బంగాళాలలో వసించెడివారు. పైప్రముఖులేగాక, బరోడా, తిరువాన్కూరు, సంస్థానముల దివానులు దివా౯బహద్దరు శ్రీ. ఎస్. శ్రీనివాసరాఘవఅయ్యంగారు, సుప్రసిద్ధబారిస్టరు, శ్రీ నార్ట౯ మహాశయులు, సర్. శ్రీ వి. టి. దేశికాచారి. శ్రీ. ఎస్. సుబ్రహణ్యయ్యరు మున్నగు ప్రముఖులందఱును లజ్‌రోడ్డున వాసముండిరి. లజ్‌చర్చిరోడ్డు బంగలాలతో ఐరోపనియునులే వసించుచుండిరి. కాని గడచిన, 70, 80, సం||గా చెన్నపురివాసులు ఈబంగాళాలకొని వీనియందు