పుట:Sri-Srinivasa-Ayengar.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


చెప్పుదురు. బుడతకీచులు మొట్టమొదట ఇండియాకు వచ్చినప్పుడు వారియోడ మదరాసుతీరమున నాగి యుండెను. అప్పుడు తీవ్రమైన గాలి తుపానువల్ల సముద్రపుఅలలు పర్వతాకారముగ మైలాపూరు లోపలికివచ్చుటకు ప్రారంభించెను. ఓడలనడపువారు సెయింట్ మేరీకి ప్రార్థనలు సలుపుచూ నిటునటూ ఊగుచుండిన యోడలోనుండిరి. ఏయాపద లేక పోయినచో మేరీపేర యొకచర్చీని నిర్మింతుమని ప్రార్థనగావించుకొనిరి. దేవునిదయవల్ల ఉదయము కాగానే Santhome Church ఓడలో నున్న వారికి కనఁబడినమీదట ఓడదిగిగట్టుచేరిరి. ఆపడమటి తట్టు ఒకజ్యోతికనఁబడి యదృశ్యమాయెను. కావున ఆచోట బుడతకీచులు పైఁజెప్పిన 'అడవిగుడిని' నిర్మించిరి. శ్రీమా౯గారు 'అంజద్ బాగ్' బంగాళాన వాసమేర్పఱచుకొన్నప్పుడు ఎదుటనున్న ప్రదేశము ఒకచిన్నయడవిగా కనఁబడుచుండెను. ఎటుజూచినను సీమచింతచెట్లును, అత్తి, మఱ్ఱి, రావిచెట్లును, కప్పలును విశేషముగా నుండెను. కొన్నిప్రదేశములలో వెదురుపొదలు కనఁబడుచుండెను 'అంజాద్ బాగ్' ఆవరణమున గురిగింజచెట్టు, రెండుమూడు గంధపుచెట్లు ఉంటూయుండెను. రాత్రిరోడ్డు జన సంచారములేక నిశ్శబ్దముగ నుండును. చీకటిపడగానే