పుట:Sri-Srinivasa-Ayengar.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

39


పూర్తిపెట్టెను శ్రీమా౯గారికిప్పించెదనని ప్రాధేయపడెను. అంత శ్రీమా౯ ఆగ్రహముచెంది స్టేష౯మాస్టరును రప్పించి యతనిద్వారా నాఐరోపియ౯కు సలహా చెప్పించి యతనిని దింపి మరొక పెట్టె కెక్కించునట్లు జేసిరి. అమీదనే శ్రీమా౯గారు తనపెట్టెలో ప్రవేశించి నిమ్మళముగ కూర్చుండిరి. ఆవెనుకనే బండి కదలినది. ఇట్టి సంభవము లనేకము లప్పుడప్పుడు తటస్థించెడివి.

ఎచ్చటికివెళ్లినను తనయిష్టప్రకారము అన్నియు సాగవలెనేకాని "పోనీ యింకొకమారు చూచుకొనవచ్చునని తలచెడువారుకారు. వీరితో ననేక దూరప్రదేశములకు నేను ప్రయాణము చేసితిని. కావున కొన్నివేళలలో నావంటివారికి రాజోపచారముల చేయుమని వంటమనిషి కస్తూరితో చెప్పెడివారు. నాకు పడిసెమో, తలనొప్పియో ఏదైనా గలిగినప్పుడు వెంటనే డాక్టరువద్దకుఁ బంపి మందుపుచ్చుకొనుమని ప్రోద్బలపఱచెడివారు. ఇంటగానీ బయటగానీ ఏయూరిలో నేదోబసలోగాని వీరున్నచో ఏవందమందో ఆచోటనున్నట్లు కనఁబడును. వీరు పైకివెళ్లినచో ఏసందడి వినరాదు.

Luz Church Road. పడమటివైపు చర్చియుంటున్నది. దీనిని మైలాపూరువాసులు 'అడవిగుడి' యని