పుట:Sri-Srinivasa-Ayengar.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


సలహా చెప్పవలసినదే గాని మరెవరు వీరిని పిలవలేరు, సాహసించికూడ వీరికి సలహాల జెప్పరు.

రైలుప్రయాణము సాగించునపుడు వీ రెవరితోనైనను మాట్లాడుచున్నచో టైముప్రకారము నడవవలసిన రైలుగూడ కొంతసేపు ఆగవలసియుండును. ఒకతూరి ఉదకమండలమునకు వెళ్లుటకు మేట్టుపాళెము రైలులో కూనూరునకు ప్రయాణమై, రెండవక్లాసుపెట్టె నంతను తనకే రిజర్వు చేసికొని యుండిరి. ఒక ఐరోపియ౯ వీరిపెట్టెలోనికివచ్చి కూర్చుండెను. అది శ్రీమా౯జూచిరి. మనజాతీయ పోరాటముల ప్రధానభూమికయై ఐరోపియ౯ల పరిపాలనలో ఉంటున్న క్లిష్టపరిస్థితులలోని దేశీయవ్యవహారములలోనున్న వివిధసమస్యలను చక్కగ నెరిగియున్న శ్రీమా౯లో జాతీయత ఒక్క పెట్టున విజృంబించగా నొక తుపానురేగెను. శ్రీమా౯ అతనిని తనపెట్టెదిగమని ఎంతజెప్పినను అతడు వినలేదు. అంత శ్రీమా౯ గార్డును పిలిపించెను. అతని తన పెట్టెనుండి దింపి రైలు నడపమనిరి. తన పరువుప్రతిష్టలకే దెబ్బ తగిలెననుకొనెనో, ఏమో నేను చెప్పలేనుగాని, ఆ మూర్ఖుడుమాత్రము ఎవరిమాటలను వినలేదు. గార్డు నయముగజెప్పినను వినడు. మందలించినను వినడు. దిగడు. అపుడు చేయునదిలేక గార్డు ప్రక్కస్టేష౯లో