పుట:Sri-Srinivasa-Ayengar.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

37


సినదే ! వీ రాసమయముల చేయుచుండునది యేమనగా: ఒకకానీకి కొఱగాని నేఅవ్యక్త వ్యక్తితోనో లేదా, ఒక 0-4-0 స్వచ్చంద కాంగ్రెసుసేవకునితోనో తోటలో పచారుచేయుచు దేశవిషయములను చర్చించుచుండవలసినదే. నీవైపున్న ప్రపంచము తగులబడిననుసరే, ప్రళయమేవచ్చి తన కొంపమునిగిననుసరే, కేసులు కక్షిదారులు తన్ను దులుకొనిపోయిననుసరే, ఏది ఏమైనను వీరంతే. వీరికేదిన్నీ నేవిధమైన యోగభంగమునుచేయవు. వీరి నెవరుగాని నెదురెదురుగా సమీపించ భయపడువారు. వారి పకృతి అంద రెరిగియే యుండిరి. ఆప్రకృతికి అందరు జడియుచు నెపుడెపుడే ప్రళయమూడిపడునో ! ఏమి జేసిననేమో! అని దిగ్భ్రమజెందియుందురు. ఆదోరణిలోని ఆ అనర్ఘలవాహినికెదురీద నెవరికిన్నీ గుండె లేక తమకున్న కోపాదులనన్నిటి నడచుకొని శ్రీమా౯వారి సలహా లెప్పు డెప్పుడా అని తపస్సు జేయుచు - దేవుడివరమునుకోరి వ్రతము – జేయు ఆ వారికి శ్రీమా౯ గారి శ్రీగంటిజూపుతో పడిన అన్నిబాధలు సమసిపోవుచుండినవి. వీరితో నొకరుపలుకరుకాని అందరిని వీరు పలుకరించువారు. ఒకరిని వీరు పిలవవలసినదే గాని ఒకరికివీరు.