పుట:Sri-Srinivasa-Ayengar.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


కొని యొకమూల ఒదిగిపడి యుండవలసినదే! వీరు తాచేపట్టిన వ్యవహారముననో తన ఆలోచనల తెరపి పడిన అంశములందో తదేకధ్యానమునిల్పి యోగులు సమాధిస్థితులైనట్లు తాదాత్మతనొంది తన పరిసరములు నుండివేఱై అదేదో మరొక ప్రపంచమున నున్న నొకానొక సిద్ధునిరీతి యోగానుభూతిలో విలీనుడై యుండ మరి గత్యంతర మేమున్నది? ... ఆసమయముల వీరిదోరణినిగాని, వీరి ధ్యానమునుగాని వీరుంటూన్న దళానుభూతులగాని: నీనైపున్న నెంతటి తలపోవుసందర్బములుగాని నేప్రాపంచిక ఆశాపాసములు గాని వీరిదృష్టి నాకర్షించ జాలనందున వీరున్నస్థితినే రూపుకదలక ఉందురు: అనగా, వీరిని ఆసమయముల నెవరున్నూ సమీపించి వీరి ధ్యానదారణముల భంగపఱచరు. ఎవరున్నూ సాహసించరు. ఎవరు సాహసింతురు ? అందరకు అంతఃజ్వరమే. వీరికై, లక్షలు, లక్షలు దనపుసంచులతో ఒకరివెనుక నొక్కొక్కరుగ జమీ౯దారులు, శ్రీమంతులు క్యూలో నిలచి నిలచి కాళ్లతీపులతో, మనస్సుల విసుగు, కేసు లేమగునో అను తహ తహాలతో, వీరింట ఏమిచేయను దిక్కుతోచక దేవుడా ! యని పడి ఉండవలసినదే, ఎంతకాలమైనను శ్రీమా౯ దయ వెట్టువరకు ద్వారబంధపుసేవ జేయుచుండవల