పుట:Sri-Srinivasa-Ayengar.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

35


1910 సం|| శ్రీమా౯గారు లజ్‌రోడ్డునందలి 'అంజాద్ బాగ్‌' బంగళాను కొనిరి. అప్పటికి వీరి మామగారు సర్ . శ్రీ వి. భాష్యంఅయ్యంగారు మరణించి రెండు సంవత్సరము లాయెను. 1911 వ సం|| కొత్తబంగళాకు శ్రీమా౯ వచ్చిచేరిరి. 1910 సంవత్సరమున కుమార్తెకు వివాహమత్యంతవైభవముగ జరిపిరి. వివాహముహూర్తము మద్యాహ్నము 12 గంటలకు నిర్ణయింపఁబడెను. కాని 10 గంటలకు కాబోలు అల్లుడు వారియెదుట నిలఁబడియుండగనే కూతురుని భార్యను దగ్గఱనుంచుకొని గంటసేపు భార్యాభర్తల విధులఁగూర్చిన సమస్తము బోధించు చుండగా, నీలోపుగనే నౌకరులు, వంటవారు ఇంటి యజమాని మొదలైనవారు కనఁబడనందున ఎచ్చటికి వెళ్లిరో తెలియక తహతహపడిరి.

శ్రీమా౯ గారు ఏవిషయమునుగూర్చి మాట్లాడుటకు ప్రారంభించిననుసరే ఏపనిచేయుటకు ప్రారంభించిననుసరే అది ముగియువరకు వారిమనస్సు దానియందే నిమగ్న మైయుండును. ఒక గుమాస్తాలుగాదు, ఒక నౌకరులుగాదు, తన భార్యాగాదు, తన పిల్లలుగాదు, శ్రీమంతులైన కక్షిదారులుగాదు, మహారాజులుగాదు అందరును అంతవరకు కాచు