పుట:Sri-Srinivasa-Ayengar.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


దాఖలుచేసినను నీకేసునెగ్గదని నిష్కర్షగ ముంచే చెప్పిరి. అన్నట్లే జరిగెను.

పిఠాపురము, వెంకటగిరి, విజయనగరము, నూజివీడు మున్నగు సంస్థానముల కేసు లనేకముల శ్రీమా౯ చేపట్టెడివారు. అహోబిలము, తిరుపనందారు మున్నగు మఠముల కేసులలోగూడ వీరే సీనియరు వకీలుగ వాదించెడివారు. పై మఠముల కేసులలో కొన్నింటిలో ఫీజునే పుచ్చుకొనక హైకోర్టున వాదించెడివారు. పలుమారు బైటికోర్టులకు వెళ్లవలసి యున్నందుచే కస్తూరియనే పేరుగల వంటవాని వెంటఁబెట్టుకొని అన్ని చోట్లకు వెళ్లెడివారు. సకాలమున చక్కగ నప్పటికప్పటికి వేడిగ సిద్ధము గావించిన నాహారములనేతప్ప మఱి నింకొకదానిని పుచ్చుకొనెడివారే కారు.

ఏకోర్టునగానీ వీరు వాదించునప్పుడు చుట్టుప్రక్కల ఏవందలకొలదో జనము గుమిగూడుట సర్వసాధారణముగ నుండగా, జడ్జీలుగూడ వీరిమాటల చాలశ్రద్ధతో వినుచు ఎంతో మెలకువతో వర్తించెడివారు. వీరి ననుసరించి ఉంటూన్న వంటవాడు కస్తూరియు, గుమాస్తా శ్రీరామచంద్రుఁడును ఇంటికివచ్చినదే ఆనాడు కోర్టునజరిగిన వృత్తాంతముల నన్నిటిని, ఇంటివారికి చెప్పెడివారు.