పుట:Sri-Srinivasa-Ayengar.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

33


వారు. కేసు జయమొందునని తనకుతోచునట్టి కేసునే వీరుచేపట్టెడివారు. కేసున సాక్ష్యములే దనియు, ఈకేసు తప్పకత్రోసివేయఁబడుననియు కక్షిదారులతో చెప్పి అపీలుగావించి వృథాగా డబ్బు ఖర్చుపెట్టవలదని సలహాచెప్పెడివారు. వీలైతే ప్రతి వ్యవహారము రాజీగావించుటయేమేలని అనేక సందర్భములలో కక్షీదారులకు సలహాచెప్పెడివారేకాని, ఏపాడు కేసునైనా దాఖలుచేసి ఒకద్రవ్యమే నార్జింపవలెననెటి నీచము శ్రీమా౯కు ఉండెడిదికాదు. ఒకప్పుడు ఒక శ్రీమంతుడు తనకేసును శ్రీమా౯పుచ్చుకొని అపీలు దాఖలుచేసి నడపవలెనని నిర్బంధపఱచెను. శ్రీమా౯మాత్రము అపీలు చేయుటవలన లాభముండదని నిష్కర్షజేసుకొని నెంతచెప్పినను వినక శ్రీమా౯గా రపీలు దాఖలుచేయకున్నచో ఆకక్షదారుడు తనయూరులోనేఅడుగు బెట్టక పైలోకమునకు వెళ్లవలసినదితప్ప గత్యంతరము లేదని మొఱపెట్టెను. సముద్రమునందుపడి ప్రాణత్యాగము తప్పక చేసికొందునని నాకక్షీదారుఁడు చెప్పగా, అతని దగ్గఱకుపిలచి మిత్రులుకొందరు నీకేసున అపీలు దాఖలుచేయుమని చెప్పుచున్నారు. నీవున్నూ ప్రోద్బలపఱచుచున్నావు. కాని అపీలు