పుట:Sri-Srinivasa-Ayengar.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


కృష్ణస్వామిఅయ్యరు, శ్రీసుందరరాజఅయ్యంగారు, శ్రీ కె. భాష్యంగారు, శ్రీ గణేశఅయ్యరుగారు, శ్రీ సంపత్కుమారఅయ్యంగారు, శ్రీ ఎస్. వి. నారాయణఅయ్యరు మున్నగువారు వీరివద్ద అప్రెంటీసులుగానుండిరి. మొట్టమొదట అఫ్రెంటీసుగాచేరి ఆమీద చాలకాలము వీరి జూనియరువకీలుగానుండిన శ్రీ కే. రాజాఅయ్యరుగారు క్రమేణ గొప్పవకీలై అడ్వకేటుజనరల్ పదవిని సంపాదింపగల్గిరి.

ఒరిజనలుసైడున వకీలుగా నెలకు ఏడెనిమిదివేలు గడించుచు హైకోర్టు జడ్జిపదవి యధిష్ఠింపనున్న శ్రీ ఎస్. దొరస్వామిఅయ్యరుగారు అన్నిటిని త్యజించి పుదుచ్చేరియందలి శ్రీ అరవిందాశ్రమము చేరిరి. శ్రీమా౯వద్ద అప్రెంటీసుగానున్న శ్రీ దొరస్వామిఅయ్యరుగారు (సంగీత విద్వాంసులు) ముత్యాలపేట శ్రీ త్యాగయ్యగారి మనుమలు గావున సర్వమును పరిత్యజించుటలో ఆశ్చర్యములేదు. కాని వీరి యీవర్తన శ్రీమా౯గారికి మాత్రము మనస్కరించినదికాదు.

చెట్టినాడునుండి, మధుర రామనాథపురజిల్లాల నుండి కేసులపట్టుకొని నాటుకోటశెట్లు వారి గుమాస్తాలు, వారి ఏజంట్లు శ్రీమా౯గారివద్దకువచ్చినప్పుడు వారందరు శ్రీమా౯ బంగళావద్దనే బసచేసెడి