పుట:Sri-Srinivasa-Ayengar.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

31


యామీద నాభాషలోని యుద్గ్రంథములను రాత్రులలో చదివెడివారు. బాల్యమున నాంగ్లకవిత్వము చెప్పుటకు వీరుయత్నించిరని వీరి స్వహాస్తముతో వ్రాసియుంచిన కొన్ని కాగితములవల్ల తెలియుచున్నది. కాని వీనినన్నిటిని వీరు మరణించుటకు ముందు చింపిపారవైచిరి. వీరికి కళలయం దభిమానము సున్న. సంగీతకచ్చేరీలకుగాని, నాటకములకుగాని, సినిమాలకుగాని వీరు వెళ్లెడువారుకారు. ఇంటిలోని వారిని వీనికి వెళ్లరాదని చెప్పెడివారు. ఎన్నడైన వీరి కుటుంబీకులు రాత్రి, ఏదైన సినిమాకో, నాటకమునకో వెళ్లినచో నిద్రమానికేకలువేయుచు బంగళా వసారాన నిటునటు తిరుగుచు నిద్రమాని యింకను ఇంటివారు రాలేదేయని నౌకరులతో మొఱబెట్టుచుండెడివారు. శ్రీమా౯గారి కుమారుఁడు, కుమారై రాత్రులలో బయటికి వెళ్లినపుడు భార్యను బాధపెట్టెడివారు. కావున అందఱును బయటికి వెళ్లుట మానవలసివచ్చెను.

వీరు మైలాపూరు ఉత్తరమాడవీధిలో నున్నపుడు వకీలువృత్తిలో అపారధనమును సంపాదించు చుండిరి. వీరివద్ద ననేకులు అప్రెంటీసులుగానుండి గొప్ప న్యాయవాదులగుటయే గాక ప్రజాసేవలో ప్రాముఖ్యతకువచ్చిరి. రావుబహదూర్ కే. వి.