పుట:Sri-Srinivasa-Ayengar.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


వారు. వీరందఱికిని శ్రీమా౯గారిభార్య వేడికాఫీ పంపెడివారు. ఆరోజులలో శ్రీమా౯గారు గుఱ్ఱపుబండిమీద కోర్టుకు వెళ్లెడివారు. కోర్టునుండిరాగానే దుస్తుల మార్చుకొని మైలాపూరి క్లబ్బునకువెళ్లి అచ్చట Billiards ఆట ఆడెడివారు. క్లబ్‌నుండిరాత్రి 9 గం||కు ఇంటికి వచ్చెడివారు. ఆరోజులలో ఎలక్ట్రిక్ దీపములు, మోటారుకారులు ఒకటిరెండు మాత్రమే మదరాసున కనబడుచుండెడివి. కావున కాలినడకమీదనే క్లబ్బునకు వెళ్లెడివారు. రాత్రి వీరిని ఇంటికి పిలుచుకొనివచ్చుటకు లాంతరుతో ఒక జమానును వీరిభార్య క్లబ్‌నకు పంపుచుండెను. శ్రీమా౯గారికి అరవమునందేగాక తండ్రివలెనే సంస్కృతమునందు గూడ పరిచయముండెను. కావున నప్పుడప్పుడు బాల్యమునందువలెనే అరవనపుస్తకములనేగాక వ్యాఖ్యానము, టీకయున్న సంస్కృతలు గ్రంథములనుకూడ చదివెడివారు. వైదికులు, పండితు వీరిని సమీపించినపుడు వారు సంభాషించు సంస్కృతభాషలోగాని, వారుదహరించు శ్లోకములందుగాని లోపము లున్నచో వెంటనే వాని సవరించెడివారు.

ఆంగ్లవిద్యలో నారితేరిన మనప్రముఖులనేకులు ఫ్రెంచిభాష నేర్చుకొనేడువారు గావున వీరును నొకఫ్రెంచి యథ్యాపకునివద్ద ఫ్రెంచిభాషనేర్చుకొని