పుట:Sri-Srinivasa-Ayengar.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

29


లలో శ్రీశ్రీమా౯గారు వెళ్లుచుండెడివారు. కొంతకాల మున్నతప్రదేశమున వాసమున్నందుచే ఆరోగ్యము చక్కపడునని యితరులవలెనెవీరు భావించెడివారు. కొంతకాలమునకు కోడైకెనాలులోని 'శ్రీనికేతనం బంగళాన' వాసముండుట వీరికి సంతృప్తి కలిగించుచుండెను. ఏటేట ఈ బంగాళాలోని కొన్ని గదుల చక్కజేయించుటయు, బంగాళా వెంబడిచుట్టు బ్రహ్మాండమైన తోటవేయించుటయు వీరికి వేసవిసెలవులలో కాలముగడపుమార్గముగ కనఁబడెను. చిన్న అంశములనుగూడ పనివాండతోకలిసి చర్చించి పనుల నిర్వహించు చుండెడివారు. ఆఖరుదశలో కోడైకెనాలులోనే కాలము గడుపవలెనని వీరు చెప్పెడివారు. శ్రీ నికేతనపుబంగళా చుట్టుప్రక్కలలో చలిహెచ్చు గావున దీనికన్న కొంత క్రిందనున్న పెరుమాళ్ మలై యనుచోట మఱొక బంగళాను నిర్మించుకొనిరి. వీరి బాల్యస్నేహితులు మధురవాసులునగు శ్రీ కె. ఎస్. అయ్యావయర్, శ్రీ సీతారామయ్యర్, మైలాపూరునందలి శ్రీ వి. సి. శేషాచారి, శ్రీ జీవాజీరావు మున్నగు వకీళ్లు వీరి యింటి కప్పుడప్పుడు వచ్చుచుండెడివారు. చాడ్ ఫీడ్ సుబ్రహణ్య అయ్యరుగారు శ్రీమా౯గారింటిలో పలుమారు సమావేశమై పేకాట ఆడెడి