పుట:Sri-Srinivasa-Ayengar.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


చెప్పుచుండెడివారు. హిందూలాన అనేక సందిగ్ధాంశములు కలవు గావున భారతీయులు పైకి రావలె నన్నచో మతము నిబంధనలపై నాథారపడక స్వేచ్చగా శాసనములో నవసరమైన మార్పుల గావించి తీరవలెనని చెప్పెడివారు. హిందువుల సాంఘిక కట్టుదిట్టములతోగాని మతసంబంధమైన ఏర్పాట్లతోగాని బ్రిటిషుప్రభుత్వ మేలాటి సంబంధము కలిగించుకొనదని వెల్లడించినందుచే భారతీయుల పురోభివృద్ధికి అంతరాయము కలిగెనని శ్రీమా౯ అభిప్రాయపడెడివారు.

మైలాపూరు పలాతోపు ఇంటిలో 6 సం|| శ్రీమా౯ కాపుర ముండిరి. వీరు న్యాయవాదవృత్తిలో ప్రాముఖ్యత సంపాదింపఁగనే, ఉత్తరమాడవీధిలోనున్న మామగారియింటిలో వాసమేర్పఱచుకొనిరి. వీరిభార్యకు చదువు తక్కువ యయినను అనేక అరవపుస్తకముల నింటిలో చదివి యందు కొంత పాండిత్యమును సంపాదింపఁగల్గిరి. శ్రీమా౯గారిభార్య ఆంగ్లభాషా పరిచయము కలిగియుండవలెనని తలచి ఒక ఆంగ్ల ఉపాధ్యాయుని నియమించి మాట్లాడుటకు చక్కగ చదువుటకును, చదివి యర్థముచేసికొనుటకును, ఏర్పాట్ల గావించిరి. ఆరోజులలో కుటుంబముతో కూనూరునకో, ఉదకమండలమునకో వేసవి సెలవు