పుట:Sri-Srinivasa-Ayengar.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

27


అవ్వసు చూచుచు తలవెండ్రుకలు తెల్లపారిన మీదట నగలెందుకు ధరించుచున్నావని ప్రశ్నించినందుకు తాతగారగు భాష్యంఅయ్యంగారు నవ్వుచు నీనగ లన్నింటిని మూలపడవేయవలయునని చెప్పిన మొదట చుట్టుప్రక్కల నున్న వారందఱు నవ్విరట. 1908 సం||న సర్. వి. భాష్యంఅయ్యంగారు మరణించిరి..

మదరాసు హైకోర్టున సీనియరు వకీలుగానుండిన శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరుగారు రాష్ట్ర గవర్నరు నిర్వాహక సభాసభ్యులుగ నియమింపఁబడిరి. శ్రీపి. ఆర్. సుందరయ్యరుగారు హైకోర్టు జడ్జిపదవిని అధిష్టించిరి. అప్పుడు శ్రీమా౯ ఎస్. శ్రీనివాసఅయ్యంగారు మదరాసు హైకోర్టున ప్రబలసీనియరు వకీలుగ పరిగణింపఁబడిరి. వీరితోఁబాటు శ్రీ కె. శ్రీనివాసఅయ్యంగారు కూడ పైకి. రాగలిగిరి కావున వీ రుభయులు గొప్పకేసులలో న్యాయవాదులుగ వ్యవహరించెడివారు.

1909 సం||ఏప్రెలున భారతరాజ్యాంగ సంస్కరణల గూర్చిమదరాను Advocates Association ఒక చక్కనియుపన్యాసము సాగించిరి, ఈ యుపన్యాసములను ఆమీద పుస్తకరూపమున ప్రచురించిరి. కాలానుసారముగా పరిస్థితులు మారును గావున శాసనములలో నప్పుడప్పుడు సవరణ లావశ్యకమని వీరు