పుట:Sri-Srinivasa-Ayengar.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


అప్పట్లో శ్రీ పి. ఆర్. సుందరయ్యరు శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరులు మదరాసు హైకోర్టున ప్రబల సీనియరు వకీళ్లుగా నుండిరి. శ్రీమ౯గారి భార్యపై భాష్యంఅయ్యంగారికి అభిమానము హెచ్చుగనున్నందుచే నామె ఎదికోరినను భాష్యంఅయ్యంగారు లేదన్నరైరి. ఊత్తుమలై జమీ౯ కేసులో వాదిప్రతివాదు లిద్దఱును, శ్రీభాష్యంఅయ్యంగారే కేసులునడపవలెనని తొందరబెట్టిరి. కాని భాష్యమయ్యంగారునకు దిక్కుతోచకయున్న స్థితిలో ఊత్తుమలై జమీ౯దారిణి శ్రీమా౯గారి భార్యవద్దకు వచ్చి తమవైపు హైకోర్టున శ్రీభాష్యంఅయ్యంగారు వాదింపవలెసని ప్రాధేయపడెను. శ్రీమా౯గారిభార్య ప్రోద్బలమువల్ల ఆమె కోరికను సఫలముచేయుచు ఈకేసున కొన్నిరోజులు హైకోర్టున వాదించి జయమొందిరి.

శ్రీభాష్యంఆయ్యంగారు రెండు గుఱ్ఱములబండిలో శ్రీమా౯గారింటివద్దకు వెళ్లి వారికుమారుని కుమార్తెనుసముద్రఫుటొడ్డునకు తీసికొనివెళ్లెడివారు. మార్గమున తినుటకు ఏదైన వీరి కిచ్చెడివారు. బాల్యమున శ్రీమా౯ కుమార్తె అంబుజమ్మాల్ మాటకారి యని కొందఱు తలచెడివారు. తాతగారగు భాష్యంఅయ్యంగారి బంగళాకు ఒకప్పుడు వెళ్లినప్పుడు తన