పుట:Sri-Srinivasa-Ayengar.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

25


శ్రీమా౯గారు B. L. పరీక్ష ప్యాసుకాగానే మామగారగు సర్. వి. భాష్యంఅయ్యంగారివద్ద వారి పెద్దల్లుఁడు దివా౯బహదర్ శ్రీ సి. ఆర్. తిరువేంకటాచారి, శ్రీ వి. వి. శేషాచారి, సర్, వి. సి. దేశికాచారి, యస్. గోపాలస్వామిఅయ్యంగారు మున్నగువారు జూనియర్లుగానుండిరి. శ్రీమా౯ గారికన్న న్యాయవాదవృత్తిలో సీనియర్లు. వీరేగాక మఱి కొందరు జూనియర్లుగూడ భాష్యంఅయ్యంగారి కచ్చేరీలోనుండెడివారు. సర్. వి. భాష్యంఅయ్యంగారు బుద్ధిసూక్ష్మత, అసాధారణప్రజ్ఞ, హిందూ న్యాయశాస్త్రమున ససమానప్రతిభ కలిగియున్నందువల్ల మదరాసుహైకోర్టు న్యాయవాదులలో నగ్రస్థానము వహింపగల్గెను. కాని శ్రీమా౯గారి తండ్రి కనబడినపుడు తనకంటె శ్రీమా౯ తెలివితేటలు గలవాఁడని చెప్పెడివారు. మామగారు ఊత్తుమలై జమీ౯కేసు, విజయనగరము పిఠాపురము మున్నగు సంస్థానకేసులలో పనిచేయుచున్నప్పుడు శ్రీమా౯గారుకూడ మామగారికి జూనియరుగా ఆతిశ్రద్ధతో పనిజేసెడివారు. కాని కొంతకాలమునకు జూనియరుగా నుండుటమాని స్వేచ్ఛగా కేసులవాదించుటకే ప్రారంభించిరి. ఆమీఁద కొంతకొలము శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరుగారితో కొన్ని గొప్పకేసులలో పనిచేసిరి.