పుట:Sri-Srinivasa-Ayengar.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


చున్నామని'చెప్పివెళ్లిరి. శ్రీమా౯వంటి మహనీయుని మాటలవినుటకు తమ కింతకాలమున కవకాశము కలిగెననియుచెప్పిరి. వారిమాటలలో వెలిబుచ్చునభి ప్రాయములు బుద్దితీక్ష్ణతను కనబఱచు నెన్నియో నూతనాంశముల వెల్లడించునుగావున శ్రీమా౯ గారి మాటలకు విలువహెచ్చని గుర్తింపవలెను. వీరు శ్రద్ధతోచదివి గుర్తించినయంశముల నెన్నిటీనో విమర్శతో చెప్పెడివారు. హెచ్చుగ చదువుటవల్లనే వీరిప్రజ్ఞ క్రమేణవృద్ధియాయెను.

శ్రీమా౯గారు F. L. షరీక్షకు చదువునప్పుడు మామగారగు శ్రీ భాష్యంఅయ్యంగారి పలాతోపు ఇంటిలో వాసమేర్పఱచుకొనిరి. వారి కప్పుడు ఇరువదిరెండేండ్లప్రాయము వారి భార్య పదునైదేండ్ల ప్రాయము మధురనుండి తండ్రిగారు ఇంటిభోజన ఖర్చులకై వందరూపాయలు ప్రతినెల పంపెడివారు. ఈసొమ్ము దగ్గఱనుంచుకొని జాగ్రత్తగ ఖర్చుబెట్టుచు చదువుచుండెడివారు. ప్రతినెలపై వందరూపాయ లేవిధముగా ఖర్చాయెనను లెఖ వివరముల తండ్రిగారికి తెలియఁజేసెడివారు. వీరితండ్రిగారు ఒక్క దమ్మిడి ఖర్చుబెట్టుటకు ఆలోచించెడివారు. కావున వారికి నసంతృప్తికలుగు ఖర్చుల గావించెడివారు కారు.