పుట:Sri-Srinivasa-Ayengar.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

23


కొంతసేపటికి నైదారుమైళ్లు నడచినట్లు భావించెడివారు. వచ్చినవారు సెలవుపుచ్చుకొని వెళ్లుచుండినను, బంగళాగేటువరకు మాట్లాడుచు వారినివెంబడించెడివారు. ఒక్కొక్కప్పుడు బయటకి వెళ్లుటకు మోటారుకారు రాగానేయొకకాలు Foot Board మీఁదను, మఱొకకాలు బంగళామెట్లమీదను నుంచి యరగంటసేపు మాట్లాడెడివారు. కాని ఎల్లప్పుడు వీరిమాటల వినుటకు ఎందరో ఆతురతతో శ్రీ శ్రీమా౯ గారి బంగళాకు వచ్చెడివారు. కాంగ్రెసుతో సంబంధమువదలినమీదట ఒక స్నేహితుఁడు వీరిని సందర్శింపతలచితిననిచెప్పెను. 'వారువచ్చుపని నాకుతెలియును గావునను నామనస్సును మార్చుటకు నాకు శక్యముకాదు కావునను నన్ను సందర్శించుటవల్ల నేమియు లాభముండదనిచెప్పిరి' ఆ మిత్రుడీ మాటలవినక ఒకరోజు ఉదయము 8 గం|| లకు శ్రీమా౯గారిని సందర్శించుటకు 'అంజద్ బాగ్‌' నకువచ్చి 8 గం|| మొదలు 12 గం|| వరకు కాచియుండిరి. డ్రాయింగురూములో 4 గం!! కాలము వీరొకే ధోరణితో మాట్లాడిన పిమ్మట నామిత్రుడువెళ్లగనే జడివాన వలిసెనని కొందఱు తలంచిరి. వచ్చినమిత్రుడు తనపని సానుకూలము కాకపోయినసు 'ఈరోజొక శుభదినముగా భావించు