పుట:Sri-Srinivasa-Ayengar.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


వుచు కాలముగడపుట యొకఘట్టము. ఈరోజులలో ప్రముఖులెంద రెంతచెప్పినను శ్రీగాంధీ యభిప్రాయముతో నేకీభవించననియు గాంధీ కాంగ్రెసు నాయకుఁడనియు, అందుచే కాంగ్రెసునచేరననియు చెప్పుచుండెడివారు. శ్రీభాష్యంఆయ్యంగారి కుటుంబమున శిష్టాచారమునకు ఏలోషము లేనట్లే శ్రీశేషాద్రిఅయ్యంగారి కుటుంబమువారుకూడ శిష్టాచారసంపన్నులుగా నుండుటలో ఆశ్చర్యము కనుపడదు. శ్రీమా౯ మామగారి యింటియందు విద్యార్థిగానున్నపు డితరు లెవరితోను మాట్లాడెడివారు కారు. రేయింబవళ్లు పుస్తకకాలక్షేపము చేయు చున్నందున మామగా రొకప్పుడు వకీలుగ ధనమార్జింపఁదలచినచో మౌనముగా నుండుటతగదని హెచ్చరించెడివారు. భాష్యంఅయ్యంగారింటి వారందఱును శ్రీమా౯ ఒక విచిత్రవ్యక్తియనిచెప్పెడివారు. ఇట్టి శ్రీమా౯ కొంతకాలమువరకు తనయింట కెవరువచ్చినను వారు మాట్లాడుట కవకాశ మివ్వక గంటలకొలది తానే మాట్లాడుట అనేకుల కాశ్చర్యము కలిగించుచుండెను. 'అంజద్ బాగ్‌' బంగళావసారాలో నిటునటు తిరుగుచు వచ్చెడి వారితో మాట్లాడెడివారు. వీరివెంబడి గంటలకొలది వీరిమాటలవినుచు నిటునటు తిరుగువారు.