పుట:Sri-Srinivasa-Ayengar.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

21


ఖాస్తుపెట్ట యత్నించిరి కాని తండ్రిగారు వకీలుగా నుండుమని ప్రోద్బలపఱచినందుచే బి. ఎల్. పరీక్షకు చదువుటకు ప్రారంభించిరి. హిందువులకు ధర్మరక్షార్థ ప్రకారము నాలుగాశ్రమములు నిర్ణయింపబడియున్నవి. మనపూర్వీకు లీనాలుగాశ్రమ నిబంధనలకు బద్ధులై వ్యవహరించినట్లే శ్రీమా౯ శ్రీనివాసఅయ్యంగారు జీవితమునుగూడ నాలుగు ఘట్టములుగ విభజించుట సమంజసమని తోచుచున్నది. ప్రెసిడెన్సీ కాలేజి, లాకాలేజీలలో విద్యార్థిగానుంటూ మామగారగు భాష్యంఅయ్యంగారి యింటిలో చదువుసాగించుట యొకఘుట్టము. ఆమీద సుప్రసిద్ధన్యాయవాదియై, షరాయి, బూట్సు తగిలించుకొని సింహ గర్జనములతో హైకోర్టునవాదించుట, అపాఱధనమును సంపాదించుట రెండవఘట్టము. ఆమీద అడ్వకేటు జనరల్‌పదవిని విసర్జించి కొన్నిసంవత్సరములకు శ్రీగాంధీగారి సహాయనిరాకరణోద్యమమున పాల్గొనుచు ఖద్దరుదుస్తులధరించి అరవరాష్ట్రమంతయు, అరవమునప్రసంగించుచు ప్రచారముగావించి ఎంతోశ్రమపడి సంపాదించినసొమ్మును వ్యయపఱచుచు కాలముగడుపుట యొకఘట్టము. చివరకు శ్రీగాంధీగారి నాయకత్వమును ఎదుర్కొని కాంగ్రెసునువదలి ఇంటివద్దనే రేయింబవళ్లు, ఏదో చదు