పుట:Sri-Srinivasa-Ayengar.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


మెలసి వర్తించుచున్నను వీరికి అహంభావము కలదని కొందఱు తలచెడివారు. కాలేజీలో చదువుచున్నరోజులలో తటస్థించిన యొక సందర్భమునుగూర్చి చెప్పుట యావశ్యకమని తలచెదను. మాకాలేజి ప్రిన్సిపాల్, నేను, శ్రీనివాసఅయ్యంగారు, లైబ్రరీలోనుండగా తిరువాన్కూరు మహారాజావారిని మేమున్నచోటికి వెంటఁబెట్టుకొని వచ్చిరి. అచ్చటనున్న విద్యార్థులందఱును లేచి నిలచిరి. కాని మే ముభయలము లేచినిలవక ఏదో పుస్తకము చదువుకొనుచుంటిమి. మేము ఇతరులు చెప్పునట్లు వ్యవహరించువారము కామనియు, స్వతంత్రులమనియు ప్రిన్సిపాలుగుర్తించి మమ్ము మందలింపరైరి."

ఆరోజులలో శ్రీమా౯గారికి ఇంగ్లాండువెల్లి ఐ. సి. ఎస్. పరీక్షకు చదువుటకు కోరికయుండెడిది. కాని తండ్రిగారు శేషాద్రిఅయ్యంగారు తాను బ్రతికియున్నంతవరకు సముద్రయానము సాగింపరాదని నిష్కర్షగా చెప్పినందుచే తాను విదేశములకు అప్పట్లో వెళ్లనని వాగ్దానము చేసెను. బి. ఎల్. పరీక్షకు చదివి ప్యాసయి న్యాయవాదిగ కాలము గడపుటలో ఆరోజులలో శ్రీమా౯ గారికి ఇష్టము లేకుండెను. మైసూరు సివిల్ సర్వీసు పరీక్షకు దర