పుట:Sri-Srinivasa-Ayengar.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

19


కావున వివాహమంటపమున ముహూర్తమునాడు వేయిమందికి పైగా అతిథులు వచ్చియుండిరని తెలియుచున్నది.

ఎఫ్. ఏ. పరీక్షకాగానే, బి. ఏ. పరీక్ష చదువుటకు శ్రీమా౯గారు చెన్నపట్టణమునకు వచ్చి ప్రెసిడెన్సీ కాలేజిలో చేరిరి. మామగారగు శ్రీభాష్యం అయ్యంగారి బంగళాలో బి.ఏ. పరీక్షకు చదువునప్పు డుండెడివారు. బి. ఏ. పరీక్షలో ఆర్థికశాస్త్రము, చరిత్ర, చక్కగ చదివి, బి. ఏ. పరీక్షలో ఇంగ్లీషు నందును ఆర్థికశాఖయందును యూనివర్సిటీన ప్రథములుగా నుత్తీర్ణులైరి. కావున మూడునాలుగు బంగారు పతకములు వీరికి లభించెను. ప్రెసిడెన్సీ కాలేజి విద్యార్థిగనున్నపుడు సర్. టి. విజయరాఘవాచారి, శ్రీ జి. ఏ. నటేశఅయ్యరు, శ్రీ కె. వ్యాసరావు మున్నగువారు వీరితో చదువుకొనెడి వారని తెలియుచున్నది. అప్పటి వీరి ప్రజ్ఞనుగూర్చి సర్. టి. విజయరాఘవాచారిగారు స్వదేశమిత్ర౯ పత్రికలో నీ క్రిందియంశముల వ్రాసియున్నారు. "1892-93-వ, సం||లో శ్రీ శ్రీనివాసయ్యంగారు మాతో ప్రెసిడెన్సీకాలేజి విద్యార్థిగనుండిరి. వీరి ప్రతిభను చూచి తరగతిలోని విద్యార్థులందఱును దిగ్భ్రమ చెందెడివారు. కొందరితో వారు కలసి