పుట:Sri-Srinivasa-Ayengar.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


రోజులలో వీరితండ్రి పలుమారు చెన్నపట్టణము వెళ్లి వచ్చెడివారు. సర్ . వి. భాష్యంఅయ్యంగారింట తన యభిమానపుత్రుఁడగు శ్రీమా౯తో బసచేసినప్పుడు భాష్యం అయ్యంగారింటివారు 'మధుర అల్లుఁడు వచ్చెను' అని చెప్పెడివారట. భాష్యం అయ్యంగారే గాక శ్రీశేషాద్రిఅయ్యంగారుకూడ శ్రీమా౯గారికి పెండ్లిచేయవలెనని యభిప్రాయపడిరి. మధురలో కొందఱుపిల్లల శ్రీమా౯గారికి కనఁబఱచిరి. కాని శ్రీమా౯ పట్టుపట్టి వి. భాష్యం అయ్యంగారి కుమార్తె శ్రీరంగనాయకమ్మను వివాహమాడవలెనని పట్టుబట్టెను. ఈ సంబంధము అందఱికిని తృప్తికలిగించునని తలచిరి. శ్రీశేషాద్రి అయ్యంగారుమాత్రము భాష్యంఅయ్యంగారి కోరికను సఫలముగావించినచో కుమారుఁడు చెన్నపట్టణ వాసియగునని కొంతకాల మాలోచించిరి. కాని కుమారుని పట్టుదలవల్ల తండ్రిగారు తన యభిప్రాయమును మార్చుకొనిరి. వివాహమగునప్పటికి శ్రీమా౯ గారికి వయస్సు పదహారు సంవత్సరములు శ్రీరంగనాయకమ్మగారికి ఏడేండ్లు కాని యీ వివాహము అతి వైభవముగ జరిగెను. శివగంగ, మధుర, రామనాథపురము జిల్లాలనుండి బంధువులేగాక పరిచితు లనేకులు ఈవివాహమునకుగాను చెన్నపట్టణమునకువచ్చిరి