పుట:Sri-Srinivasa-Ayengar.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

17


రుని ప్రోద్బలపఱచరైరి. శ్రీశేషాద్రిఅయ్యంగారు గారికి మరణించునపుడు 85 సం!! కాని ఎన్నడును ప్రాతఃస్నానము, పూజాపునస్కారములు, శ్రీమద్రామాయణ పారాయణము మున్నగువాని ముగించుకొని ఆమీద భుజించువారు. ఆఖరుదశలో 2 సం||లు, బయటికి వెళ్లుటమాని 1916 సం!! ఏప్రెలులో ఒకరోజు పూజాపునస్కారములు పూర్తిచేసికొని భోజునముచేసి ఆమీద పడకపై విశ్రమించుచుండగా రొమ్మున బాధకలిగి వెంటనే ప్రాణమును గోల్పోయిరి. శ్రీమా౯ ఎచ్చటనున్నను వారే తన అంత్యక్రియలు నిర్వహింపవలెనని తండ్రి చెప్పుచుండెడివారు. కావున చెన్నపట్టణమున మైలాపూరునకు మధ్యాహ్నము 2 గం||కు వీరి మరణవార్తను తెలుపు తంతి వచ్చెను. అప్పటికి కొద్దిరోజులకు ముందే శ్రీమా౯ గారు ఆడ్వకేటుజనరలు పదవిని స్వీకరించిరి. రాత్రి బయలుదేరి రైలున వెళ్లినచో నాలస్యమగునని స్పెషలు రైలున మధురకు ప్రయాణమైరి.

శ్రీమా౯ అయ్యంగారు బాల్యమున రామనాథపురమున నొక వీధిబడిలో అరవము చక్కగ నేర్చికొనిరి. 1880 సం|| మధురకు రాగానే యచ్చటి హైస్కూలునచేరి ఆంగ్లవిద్య గడించిరి. ఆమీద రెండుసంవత్సరములు మధురకాలేజిలో చదివిరి. ఈ