పుట:Sri-Srinivasa-Ayengar.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


అని ఎవరైనా చెప్పినప్పుడు తాను పూర్వకాలపు మనిషియనియు, వృద్ధుఁడననియు, పాతదుస్తులే తనకు సంతృప్తి గలిగించుననియు చెప్పిడివారు. దుస్తుల ధరించుకొని బయటకు వెళ్లుటకు సిద్ధపడగానే కుమారులు శ్రీమా౯గారు కాంగ్రెసు సమావేశమునకు రావద్దని చెప్పుతూ ముందువలె సభ నెమ్మదిగా జరగదనియు సూరత్‌నందువలె అల్లరి యేర్పడుననియు తండ్రిగారు ఇబ్బందిపడుదురనియు చెప్పెను. కానితండ్రిగారు శ్రీమా౯గారిమాటను వినక కాంగ్రెసు సమావేశమునకు తాను తప్పక వెళ్లవలెనని పట్టుబట్టుచు, అల్లరిలో నీవు తగుల్కొన్నప్పుడు నేనేల యింటిలోపడియుండవలెనని చెప్పిరి. సూరత్ అల్లరిలో శ్రీమా౯గారే గాక యనేకులు చిక్కుపడిరి. కాని వీరితండ్రి వీరిమాటలు వినలేదు.

తనకుమారుఁడు మధురలోనే న్యాయవాదిగ నుండి యగ్రేసరుఁడై కీర్తిగడించుటయేగాక యపారధనము సంపాదింపవలయుననియుగూడ నప్పుడప్పుడు శేషాద్రిఅయ్యంగారు చెప్పెడివారు. కాని కుమారుఁడు శ్రీమా౯ చెన్నపట్టణమున తప్ప ఏన్యాయవాదియు ఉత్తమశ్రేణికి రానువీలుకాదు కావున, ధనమార్జించుటకు గూడ హైకోర్టున నవకాశములు హెచ్చనియు చెప్పినమీఁదట తండ్రిగారు కుమా