పుట:Sri-Srinivasa-Ayengar.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

15


శ్రీమా౯గారు కాంగ్రెసు మహాసభకు వెళ్లుటకు సిద్ధమగుచుండగా వారి తండ్రిగారు తాము గూడ సభకు వచ్చెదమని పట్టుబట్టిరి. వీరివద్ద నొక ట్రంకుపెట్టె యుండెడిది. ఇందు ఒక పాత ఆల్‌పాకా లాంగ్‌కోటు, సరిగెధోవతి, అంగవస్త్రము, చాకలి మడతవిప్పని ఒక జలతారు అంగవస్త్రము, ఒక షర్టు మున్నగునవి యుండెడివి. వీరు రామనాథపుర సంస్థాన ప్లీడరుగా నున్నరోజులలో ధరింపఁబడు దుస్తు లివి యని తెలియుచున్నది. ఈదుస్తుల ధరించుకొనియె వీరు పైకి వెల్లెడివారు. నల్ల ఆల్‌పాకా కోటుమీద సరిగపంచెను ఎడమప్రక్క వ్రేలాడవేసికొని దానిమీద ఒక జలతారు ఎఱ్ఱ శాలువను మడతవిప్పక ఎడమభుజముపై ధరించెడివారు. ఎఱ్ఱసరిగపాగా, ముఖమున ఊర్థ్వపుండ్రములు, చెవులలో సీమకమలములపోగులు పై జేబిలో బంగారు గడియారము, చేతిలో వెండిపొన్నుకఱ్ఱ , కాలిలో కాన్పూరు పాదరక్షలు ఇవన్నియు తగిలించుకొనునప్పటికి గంటసేపు పట్టెడిది. ఇంటిలో చిన్నపిల్లలు 'శేషాద్రిఅయ్యంగారు దుస్తులధరించుట చూచి నవ్వెడివారు. ఆల్పాకాకోటున నచ్చటచ్చట రంధ్రము లుండెడివి కావున 'శ్రీమా౯వలె ఏల షరాయి, బూట్సు తగిలించుకొని బయలుదేరరాదు'