పుట:Sri-Srinivasa-Ayengar.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


యుండినను ఇల్లు చల్లగానుండుటయు మున్నగు అంశములఁగూర్చి శ్రీమా౯ ప్రశంసించెడివారు. రాత్రులలో మధురలోని బిచ్చగాండ్ర కేకలవల్ల అనేకులకు నిద్దురచేటు ఏర్పడుచుండెను. మధుర వీథులలోని జలదారులకంపు, గాడిదలకూతలు అందరికి తెలిసినదేను. ఇటీవల పరిస్థితి మారినదని తెలియుచున్నది. శ్రీశేషాద్రిఅయ్యంగారు మధురనుండి రామనాథపురమునకు రాకపోకలు సాగించు రోజులలో వీరు ఒకదంతపు పల్లకీన ప్రయాణము సాగించెడివారు. ఆ పాతపల్లకి చాలకాలము మధురలోని యింటిలో నుండియుండెను. మధురవదలి శ్రీమా౯ వారికుటుంబము మదరాసునకు వెళ్లునపుడెల్ల తండ్రిగారు కుమారునికి నూతనవస్త్రములు తెప్పించి యిచ్చెడివారు. ఆరోజులలో మధుర చీరెలకు ప్రసిద్దియుండెడిది. కావున కొన్నిసమయములందు ఎంతధరయైనను ఇచ్చితెప్పించి యీ చీరల శ్రీమా౯ కుటుంబమునకు ఇచ్చెడివారు. కావున స్వదేశీబట్టలపై వీరికి ఆదరణ హెచ్చని తేలియుచున్నది.

ఒకప్పుడు శ్రీశేషాద్రిఅయ్యంగారు చెన్నపట్టణము వచ్చియున్నప్పుడు అనగా 1903 సం||న ఆఖిలభారతకాంగ్రెసు సమావేశము తటస్థించెను.