పుట:Sri-Srinivasa-Ayengar.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

13


వము నలుగురికిని తెలియుటకుఁగాను తన పేరునకు ముందు 'శ్రీ' అక్షరమును వ్రాసెడివారు. ఇంతేగాక పెద్దకుమారునికి శ్రీనివాస౯, రెండవ కుమారునికి శ్రీవేంకటేశ౯ అని పేరుపెట్టిరి.

చెన్నపట్టణవాసము వీరి కెంతమాత్రము మనస్కరింపదు. ఎటు జూచినను ఆశుద్ది, ఎంగిలి, అనాచారములు, దుర్గంధము, చెన్నపట్టణమున కనఁబడుచున్నందున మధురవదలి ఆఖరురోజులలో ఎచ్చటికీని వెళ్లువారుకారు. శ్రీమా౯ శ్రీనివాసఅయ్యంగారు వారికి వయస్సువచ్చి చెన్నపట్టణమున వాసమేర్పఱచికొని కీర్తిగడించినమీదట తండ్రిగారిని చెన్నపట్టణమునకు రమ్మని ఎంత ప్రోద్బలపఱచినను మధురను వదలి ఎచ్చటకు రానని నిష్కర్షగా చెప్పిరి. కుమారుని పైనున్న అభిమానమువల్ల సంవత్సరమున కొకమారు చెన్న పట్టణమునకువచ్చి నెలరోజులు మైలాపూరున కుమారునితో నుండెడివారు. శ్రీమా౯ అయ్యంగారు వీరికుటుంబముతో చెన్నపట్టణముననేయుండి, వేసవిసెలవు లప్పుడు మధురలోనుండుట అలవాటు. మధురలోని యింటిలోనుండుట శ్రీమా౯గారికే గాక వీరి కుటుంబీకులకుగూడ సంతృప్తి గలిగించు చుండెను. ఆయింటి నల్లచేవగుంజలు, చిత్రించిన తలుపులు, తెల్లని సున్నపుగోడలు, బయట ఎండబాధ,