పుట:Sri-Srinivasa-Ayengar.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


చుట్టుప్రక్కలనున్న పిల్లలుకూడ రామాయణ పారాయణము వినుటకు వచ్చెడువారు. పూజ ముగియగానే అక్షింతలు తులసి పంచకొంగున ముడివేసికొని యుంచుకొనెడివారు. ఎదుట కనఁబడిన పిల్లలకు అందరికినీ నెత్తిన అక్షింతలు చల్లి తులసీదళముతో ఆశీర్వదించెడివారు. ఇంటిలోని పిల్లలు నిద్రపోవుచున్నను వారినెత్తిన పూజాక్షతలను చల్లి దీనితో వారి నిద్రవదలునని చెప్పెడివారు.

ఒకప్పుడు వీరికి జబ్బుచేసి మెడమీద రాచపుండు ఏర్పడెను. ఇంగ్లీషు చికిత్సయందుగానీ ఆపరేషనుల యందుగానీ వారికి నమ్మకములేనందున కాలినడక మీద తిరుపతివెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రార్థన చెల్లించెదనని చెప్పినమీదట పుండు నెమ్మదిగ మానెనట. ఆమీద ఆరోజులలో రైళ్లులేవు గావున కట్టెబండ్లమీద సామానులనేగాక యింటివారి నందఱినీ ఎక్కించుకొని, మార్గమున అక్కడక్కడ ఆగుచు, వంటచేసికొనుచు, కాలినడకమీదనే శ్రీశేషాద్రిఅయ్యంగారు మధురనుండి తిరుపతికి వెళ్లిరి. తిరుపతి చేరువరకు ఒకపూటమాత్రము భోజనము చేయుచు, తులసీదళమును పూజకాగానే ఆరగించుచు, తీర్థముపుచ్చుకొనుచు మరల స్వస్థలము చేరునప్పటికి రాచపుండు మాయమాయెను. ఈసంభ