పుట:Sri-Srinivasa-Ayengar.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

11


వద్దనే అన్నపానాదులు సేవించుచుండిరి. మధురలో ఏసభజరిగినను వీరి సలహాప్రకారమే కార్యనిర్వాహకులు కార్యక్రమము సాగించువారు కావున రాష్ట్రకాంగ్రెసు సభలకు విరాళములెగాక, వీరి సలహాలు కూడ లభించుచుండెను. దొడ్డిలోపశువులు, రెండెద్దుల సవారిబండి మున్నగు సౌకర్యములన్నియు శ్రీఅయ్యంగారు కలిగియుండెను. మధురలో రాష్ట్రగవర్నర్లను ఆహ్వానించుటయేగాక వారికి అన్ని మర్యాదలు సాగుటకు తగు ఏర్పాట్లవీరుగావించుచు, సామాన్యులు బీదలు మున్నగు వారి కష్టసుఖముల గవర్నర్లకు తెలియఁజేయుచుండెడివారు.

శ్రీశేషాద్రిఅయ్యంగారుగారి దైవభక్తి అపారము. రోజూ ఉదయము పండితుల దగ్గఱనుంచుకొని నిత్యకృత్యముల తీర్చుకొని ఆమీద రెండుగంటలకాలము శ్రీమద్రామాయణ పారాయణముగావించి యిద్దరు పండితులతో భోజనముచేసెడిపోరు. జప తపాదులు రామాయణ పారాయణము పూర్తియగునప్పటికి 12 గంట లగును గావున ఆమీదనే భోజనము చేసెడివారు. ఉదయము కాఫీ త్రాగుటకుకానీ, ఫలహారముల తినుటకు కానీ వారు ఇష్టపడువారు కారు. పెద్దగొంతుకతో శ్రీమద్రామాయణమును చదువుచుండగా ఇంటియందలి ఆడవారు పిల్లలేగాక.