పుట:Sri-Srinivasa-Ayengar.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


ఇంజనుకొని తెచ్చియిచ్చినమీదటనే రాత్రి 9 గం|| శ్రీమా౯ హఠముచేయుట మానెను. రామనాథపుర సంస్థానపనుల నిర్వహించు చున్నప్పుడు మధురలో కూడా ఒక గృహము నిర్మించుకొని తనకుమారుఁడు. శ్రీమా౯ చదువుసాగుటకు ఏర్పాట్లు కావించెను. ఆమీద కొంతకాలమునకు శ్రీముత్తు రామలింగసేతుపతిగారికిని, శ్రీశేషాద్రిఅయ్యంగారు గారికిని సంస్థానవిషయములఁగూర్చి భిన్నాభిప్రాయములు జనించి కలతలు ఏర్పడగ రామనాథపురసంస్థానముతో పూర్తిగ సంబంధమువదలుకొని, మధురలో స్థిరవాస మేర్పఱచికొని సంస్థానమున వేతనమును గూడ సంపాదింపఁగలిగిరి. మధురలో “దానప్ప మొదలి ” అగ్రహారము శ్రీశేషాద్రిఅయ్యంగారన్నచో, మధురలోని పిన్నలు పెద్దలు వీరిని గౌరవముతో జూచు చుండెడివారు. మధురలో పౌరాగ్రేసరులుగ వ్యవహరించెడివారు. వీరిమాటకు భిన్నమగు అభిపాయమును ఏపౌరులును, మధురలో వీరిమాటకు ఎదురులేదు గావున వీరికున్న ప్రాముఖ్యత వెల్లడియగుచున్నది. ఇంటిలో ఇద్దరు వంటవాండ్రు. వీరి కుటుంబీకులే కాక శివగంగనుండివచ్చు. మిత్రులు బంధువులు మున్నగువారును, వీరి కుమాళ్లకు విద్యనేర్పు ఉపాధ్యాయులును, ఇంక అనేకులు వీరి ఇంటి