పుట:Sri-Srinivasa-Ayengar.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


ఇంటిపనులు, వంట, కుట్టుపనులు నేర్చుకొనవలెననియు, సంగీతము పాడుటకు కూడ శక్తికలిగి యుండవలెననియు అప్పుడప్పుడు చెప్పుచుండెడువారు. ఎల్లప్పుడు పుస్తకములు చదువుటమాని యింటిపనుల గమనింపుమని కుమార్తెను హెచ్చరించెడువారు. శ్రీ గాంధీతో సంబంధము ఏర్పడుటకు ముందు శ్రీమా౯గారివర్తన కుటుంబపరిస్థితులు ఎట్టివో నాకు తెలిసినంతవరకు వివరించితిని గాని నాకుతెలియని అంశములు కొన్నిగలవని చదువరులు. గుర్తింపవలెను.

శ్రీగాంధీగారిని శ్రీమా౯గారు కలసికొనుటకు చాలా సం||లకు ముందే వారు రాజకీయ సాంఘిక వ్యసహారములలో జోక్యము కలిగించుకొని కొంత కృషి సాగించియుండిరి. ఆరోజులలో న్యాయవాది వృత్తిలోను, ప్రజాసేవయందును అగ్రేసరులైన శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యంగారిని ఆదర్శముగ నుంచుకొని శ్రీమా౯ వర్తించుచుండెను. కావుననే శ్రీ కృష్ణస్వామిఆయ్యరు. వీరిని ప్రీతితో శ్రీమా౯' అని పిలిచెడివారు. 1908 సం||న మదరాసున సమావేశమైన కాంగ్రెసుకు డాక్టరు సర్ , శ్రీరాష్‌బెహారీ ఘోష్‌గారికి శ్రీమా౯గారిని పరిచయము చేయుచు "శ్రీమా౯ శ్రీనివాసఅయ్యంగారు, సర్. వి. భాష్యం