పుట:Sri-Srinivasa-Ayengar.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


నకు నిజమైన అర్థము నెఱింగిన బహు కొద్ది మందిలో ఈయన గణింపదగినవాడు. స్వోత్కరాభిలాషలేక సత్యముగ పత్రికాప్రచురమునకును దేశమునకును సేవచేసినవాడు. చూపునకు ఈయన బహు సాధువు ; కాని సునిశితమైన బుద్ధివైశద్య మితనియందుగలదు. నిర్ణయముల చాకచక్యమున్నది. నైతికోత్సాహమును వితరణదృష్టియు గలవారు. తెలుగు, సంస్కృతవాఙ్మయములయెడలను ప్రాచీన భారత ఆదర్శముల యెడలను వీరికి తన్మయత్వము కలదు. వీరి జీవితమునకు ఈ ఆదర్శములే మార్గదర్శకతారలు.

ఈరజతోత్సవ సందర్బమున త్రిలిఙ్గకును శ్రీవావిళ్ల వేంకటేశ్వరకళాస్త్రులకును నా హృదయపూర్వక అభినందనములు సమర్పించుచున్నాను. వారికి ఆరోగ్యమును, సౌఖ్యమును గలిగి ఇతోధికముగా సేవచేయుటకు అవకాశము కలుగుగాక !

శ్రీమతి యస్. అంబుజమ్మాళ్ నా షష్ట్యబ్దపూర్తి ఉత్సవము నాడు నన్ను ప్రశంసించుచు పంపినజాబు:-

తమ షష్ట్యబ్దిపూర్త్యుత్సవములకు వచ్చి యానందించు భాగ్యము లేకపోయినందులకు చింతిల్లుచున్నాను. తే 4 ది నాటి పత్రికలలో నీ విషయ