పుట:Sri-Srinivasa-Ayengar.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

163


మును చదువగా నీ యుత్సవప్రసక్తి తెలిసినది. నాతమ్ముడు శ్రీ ఎస్. పార్థసారథి చెన్నపురమునలేడు. కొడైకెనాలుకు వెళ్లియున్నాడు. అతనికి మీ యాహ్వానము అందియుండదు.

నేను మీకేమి సందేశ మంపగలను ? మిూరు మాతండ్రి, కీ. శే. ఎస్. శ్రీనివాసఅయ్యంగారుగారికి పరమాప్తులుగ నుంటిరి. స్వయముగా సంస్కృతమున పాండితి వెలయుటచే ఆయన మీ భాషాసేవ గుర్తింపగలిగి సుమారు ముప్పదేండ్లు తమయందు విశ్వాసము వహించియుండిరి. తమ రింకను అమూల్యమగు భాషాసేవ యొనర్పగల్గుటకు శ్రీమన్నారాయణుడు మీకు దీర్ఘాయు వొసంగు గాక ! మీ విశాలహృదయమును, వదాన్యతయు నితోధికముగ వర్ధిల్లుగాక !




చెన్నపురి: వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్‌సన్స్‌వారిచే

'వావిళ్ల' ప్రెస్సున ముద్రితము. -1955