పుట:Sri-Srinivasa-Ayengar.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్రిలిఙ్గ రజతోత్సవసందర్భమున

శ్రీమా౯ ఎస్. శ్రీనివాసఆయ్యంగారు పంపిన

సందేశము.

తెనుగుత్రిలిఙ్గవారపత్రిక రజతోత్సవసందర్భమున శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులవారికి కానుక సంచిక సమర్పింతు రని విని సంతోషించుచున్నాను. మేము ఇరువురమును చాలకాలముగ స్నేహితులమై యుండుటచేత ఆయన, ఆయన, శీలము ఆయన సేవ వీనినిగురించి తగినరీతిని వర్ణించుట నాకు కష్టము. విస్తారమై, సత్కార్యాచరణమున వీరు చూపిన నిరాడంబరత్వమును అప్రతిమానము. బలవంతుడు, పేద అను భేదముచూడక పాత్రులయినవారు ఏదర్జావారైనను, ఈయన వారికి గావించిన యెన్నో మేళ్లను వారికి వీరియందుకల కృతజ్ఞతాపూర్వకమైన అనురాగమును వీరికి ఉత్తమ మైన స్మరణ చిహ్నములు. ప్రాతకాలపుశీలములోని ఏ సుగుణములు మనము నేడు మఱచిపోయి ఎక్కువ ఎక్కువగా నష్టపడుచున్నామో అట్టి సుగుణముల యెడల వీరు వీడరానిభక్తి కనబరచిరి. స్నేహము