పుట:Sri-Srinivasa-Ayengar.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

157


రోజులకు సొమ్మునిచ్చిరి. అదిమొదలు ప్రతినెల నేను వారికి వడ్డీచెల్లించుచు కొంతకాలమునకు అప్పు పూర్తిగ చెల్లించితిని. తనవద్ద అప్పు పుచ్చుకొన్న వారిలో నేనొక్కడనే మాటతప్పక అప్పుతీర్చితినని. వీరు ఇతరులతో చెప్పుచుండిరని వింటిని. కావున నాపై వీరికి నమ్మకము యేర్పడెనని విస్పష్టమాయెను.

వీరితో దూరప్రయాణములు సాగించునప్పుడు వీరి జూనియర్లగు శ్రీ కే. భాష్యమువంటి వారు వీరివద్ద సొమ్ముపుచ్చుకొని ఖర్చుపెట్టెడివారు. వారు వీరిచ్చిన సొమ్మునకు లెక్క చెప్పుటలేదనియు, నన్నీపనిని చూడుమనియు వీరు చెప్పుచుండిరికాని శ్రీ కే. భాష్యము వంటివారికి అసంతృప్తి కలుగునని తలచి నే నీపనికి పూనుకోనైతిని. తన జూనియర్లు పైకి ఎచ్చటికైన వెళ్లి తనసొమ్ము వృథాగాఖర్చు గావించుచున్నారని వీరు కేకలువేయుచుందురు. కాని నేను వినివిననట్లు వర్తించుచుంటిని. మా ప్రయాణములలో గయా కాంగ్రెసు ప్రయాణము, అమృతసర ప్రయాణము దీర్ఘ కాలముసాగెను. గయలో 10 రోజులును, అమృతసరమున దాదాపు నెలరోజులును ఉండుట తటస్థించెను. గయలోని వర్తమానములగూర్చి యిదివరకే చెప్పియుంటిమి.