పుట:Sri-Srinivasa-Ayengar.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


సంపాదింతురు కాని ప్రత్యేకముగ ఒకమనిషి అవసరమనియుతలచి కాబోలు నన్ను ఈపనికి నియమించిరి. నాస్వంతఖర్చులతో అనేకులకు జాబులు వ్రాయుటయేగాక స్వయముగా కొన్నిచోట్లకువెళ్లి దాదాపు వెయ్యి ఓట్లకుపైగా నేను సంపాదింపగల్గితిని. తక్కిన వారికన్న ఈపని నేను చక్కగ నిర్వహించితిననియు, తనకు సంతృప్తి కలిగినదనియు శ్రీమా౯గారు చెప్పిరి. ఈయెన్నికలో వీరు జయమొందినమీదట శ్రీ కె. భాష్యముగారు వీరిగౌరవార్థము గొప్పవిందు గావించిరి. దానికి నేను వెళ్లియుంటిని. శ్రీమా౯గారు నన్నుచూడగనే దూరముగ కూర్చొనరాదనిచెప్పి వెంటబెట్టుకొనివెళ్లి తనప్రక్కన కూర్చొనుమనిరి. ఇందుచే వీరికి నాపైప్రీతి యేర్పడెనని తలచితిని.

1920 సం||న బందరు వాస్తవ్యులు శ్రీకోపల్లె కృష్ణరావుపంతులుగారి శ్రోత్రియగ్రామమగు అరియలూరును కొనుటకు యత్నించితిని. నావద్ద పైకము లేనందున శ్రీ వి. ఎల్. శాస్త్రిగారిని శ్రీమా౯గారితో మాట్లాడమని పంపితిని. శ్రీశాస్త్రి ఇరువదివేలు నాకు అప్పుకావలెనని చెప్పగానే తప్పక ఈ సొమ్మునిచ్చుటకు అభ్యంతరములేదనిచెప్పి కొన్ని