పుట:Sri-Srinivasa-Ayengar.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

155


పిలిచి శ్రీమా౯గారితో "వీరితండ్రి గొప్పసంస్కృతాంధ్ర విద్వాంసుఁడు. చెన్నపట్టణమున ప్రథమమున ఒక ముద్రాక్షరశాల నిర్మించి అనేక సంస్కృతాంధ్ర గ్రంథములను సంస్కరించి ముద్రించిరి. వీరు మొట్టమొదట శ్రీమద్రామాయణము, అమరముటీక, భారతము భాగవతము మున్నగు గ్రంథములను ముద్రించుటచే తెనుగు ప్రాంతమున అపార కీర్తిగడింపగల్గిరి. నన్ను శ్రీ ఆనందగజపతి మహారాజువారికి నెరుకపరచి నాచదువుకు సహాయము. చేసిరి,” మున్నగు సంగతులు చెప్పగానే శ్రీమా౯గారు నన్ను కుర్చీమీద కూర్చొనుమనిచెప్పి, తాను చెన్నపట్టణమునకుతరలిరాగానే అప్పుడప్పుడు కనబడుచుండుమని చెప్పిరి.

||

శ్రీమా౯గారు అడ్వకేటు జనరలుపదవిని వదలిన మీదట మదరాసు యూనివర్శిటీ ప్రతినిధిగ మదరాసు శాసనసభను ప్రవేశింప నిశ్చయించుకొనిరి. ఈ ఎన్నికలకు పట్టభద్రులు ఓటర్లు కావున అరవ జిల్లాలలోని ఓట్లు హెచ్చుగ తనకు లభించుననియు, తెనుగుజిల్లాల ఓట్లను అచ్చటచ్చట కొందరు వకీళ్లు