పుట:Sri-Srinivasa-Ayengar.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


మున్నగునవి లభించెను కావున క్రమేణ నీరసము తగ్గి నేను ఆరోగ్యవంతుడనైతిని. మొదటిరోజున వంటమనిషి శ్రీమా౯గారు భుజించినమీదట నా కన్నముపెట్టెను. ఈసంగతి వారు మరునాడు తెలిసికొని నాకుకూడ రెండుపూటల తనతోపాటు విస్తరి వేయుమని తెలియజేసిరి కావున నెమ్మదిగ కొన్ని రోజులు విశాఖపట్టణమున శ్రీమా౯గారి సాన్నిధ్యమున తిండితినుచు సాయంత్రము వకీళ్లతోపాటు అక్కడి బీచికి వెళ్లుచుంటిని. పదిరోజులమీదట నేను మదరాసుకు వెళ్లవచ్చుననియు, మరల సమ్మను వచ్చినచో అప్పుడు రావలెననియు చెప్పిరి. నాటి మధ్యాహ్నము కోర్టున వికీళ్లనందరిని సందర్శించి నేను మరునాటి యుదయము ప్రయాణమగుచున్నానని వారితో చెప్పి శెలవుపుచ్చుకొంటిని. రాత్రి 7 గంటలకు శ్రీమా౯గారితో తిండితినుచు నేను చెన్నపురికి వెళ్లుచున్నాననిచెప్పగా నొపుట్టుపూర్వోత్తరములను విచారించి యెన్నియోప్రశ్నలవేసిరి. ఇట్లుండగా శ్రీగురుజాడ అప్పారావుగారు శ్రీమా౯గారితో మాట్లాడుటకు వీరి బసకువచ్చిరి. నేను బయటికివెళ్లితినిగాని శ్రీ అప్పారావుగారు నన్ను