పుట:Sri-Srinivasa-Ayengar.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

153


కోర్టువెనుక నొకగదిలో వీనినుంచి నన్నొకగదిలో కూర్చోబెట్టి శ్రీమా౯గారి వంటమనిషితో "వారికి కావలసిన కాఫీ ఫలహారములను కుంపటిపై సిద్ధము గావింపు"మనిచెప్పెను. వంటమనిషి. అన్నిటిని అర్థగంటలో సిద్ధముగావించి సంస్థానఉద్యోగికి వార్త పంపగనే 5, 6 మందివకీళ్లు నేనున్న గదిలోనికివచ్చిరి. శ్రీమా౯గారు రానందున వారిని పిలుచుకొని సంస్థానోద్యోగి రాగానే అందరము ఫలహారములను పుచ్చుకొన ప్రారంభించితిమి. చివరకు అందరము లేచి వెళ్లుచుండగా సంస్థానఉద్యోగి ఎంతోభయపడుచు నాకు అచ్చటితిండి సరిపడక జబ్బుచేసినందున శ్రీమా౯గారి వంటలో కొంత నాకుతిండిపెట్టమని శ్రీమా౯గారితో చెప్పగ వా రిందుకు సమ్మతించి వంటవాని పిలిచి నాకు కావలసినట్లు అన్నముపెట్టుమని చెప్పిరి. ఆమీద నేను శ్రీసూర్యనారాయణ పంతులను మదరాసు వెళ్లుటకు అనుమతికోరుచు ఇంకను నే నేన్నిరోజు లచ్చటనుండవలసియుండునని ప్రశ్నింపగా 2, 3 రోజులలో జడ్జిగా రీసందర్భమును తెలియజేయుదురని చెప్పిరి. నాటిరాత్రి మొదలు శ్రీ అయ్యంగారికి తయారగుభోజనమున చారు, పులుసు