పుట:Sri-Srinivasa-Ayengar.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


యణవంతులుగారితో నేను జిల్లాకోర్టుకు వెళ్లితిని. 12 గంటలకుమీదన శ్రీమా౯ అయ్యంగారు కోర్టునకు రాగానే కోర్టు గుమాస్తాలు నన్ను బోను నెక్కించిరి. శ్రీమా౯గారు నన్నడిగిన ప్రశ్నల కన్నింటికిని ప్రత్యుత్తరము చెప్పినమీదట రెండు గంటలలో నాసాక్ష్యము పూర్తిఆయెను. కాని కోర్టుఉద్యోగి నాసాక్ష్యము టైపు అగుచున్నదనియు, దానిని కోర్టున నాయెదుట చదివినమీదట అందు చేవ్రాలుచేసి వెళ్లవలెననియు, ఏవైన పొరబాట్లున్న కోర్టున చెప్పవలెననియు సూచించెను. ఏవో రెండువాక్యములను నేను చెప్పలేదని కోర్టునచెప్పగానే కోర్టుఉద్యోగి ఆవాక్యములను కొట్టివేసి, నావాఙ్మూలము చివర సంతకము చేయుమన్నందునచేసితిని. దేవుడా ! అని కోర్టుహాలు వదలి కోర్టువసారాకు రాగానే త్రోవలో వకీళ్లతో మాట్లాడుచుండిన శ్రీమా౯ అయ్యంగారు నన్నుపిలిచి నావలె నితరులుకూడ సాక్ష్యమిచ్చినచో కేసు కొన్నిమాసములలో పూర్తియగునని వకీళ్లతో చెప్పగా వింటిని. ఈ లోగా విజయనగరము బసలోనున్న సంస్థానఉద్యోగి కాఫీ మున్నగు ఫలహారములతో అచ్చటికివచ్చి