పుట:Sri-Srinivasa-Ayengar.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

151


వెళ్లిరి. ఆమీద కొన్నిసంవత్సరములకు నాకు విశాఖపట్టము కోర్టునుండి సమ్మను వచ్చినందున విధిలేక అచ్చటికి వెళ్లవలసి వచ్చెను. 2, 3, రోజులలో నా సాక్ష్యము పూర్తియగునని నేను తలచితిని కాని నెలరోజులకుపైగా నే నచ్చటవుండవలసిన పరిస్థితి నేర్పడెను. కాని అన్నపానాదు లన్నిటికి సంస్థానము బంగళాలో నాకు ఏర్పాట్లు చేసిరి. కాని, ఆలావు తిండి తినలేక ఆజీర్ణమువల్ల కొన్నిరోజులు బాధ పడవలసి వచ్చెను. విశాఖపట్టణముననున్న సంస్థాన డాక్టరుచికిత్సవల్ల అనారోగ్యము తగ్గెను కాని ఆ ప్రాంతపు తిండి జతపడనందున సంస్థాన ఉద్యోగితో మదరాసు భోజనమున కేర్పాటు కావింపుమని కోరగా త్వరలో అట్లే గావింతునని వారుచెప్పిరి. కేసువిచారణను శ్రీమా౯ యస్. శ్రీనివాసఅయ్యంగారు ప్రారంభించి పదిరోజులు వాదించిరి. మొదటిసాక్షి నేను కావున శ్రీమంథా సూర్యనారాయణపంతులుగారు సాక్ష్యమున నేను చెప్పవలసిన యంశములను నాకు తెలియబరచిరి. వీరు విజయనగరము వకీళ్లలో ప్రముఖులనికూడ నాకు తెలిసెను. మరునాడు సోమవారము కాబోలు శ్రీసూర్యనారా