పుట:Sri-Srinivasa-Ayengar.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


కాపీలను (ఒరిజనల్సు) ఇప్పింపమని కోరిరి. వెదకి యిచ్చెదనని చెప్పగా రెండుమూడురోజుల తర్వాత వచ్చెదమనియు పై కాగితములను తప్పక జాగ్రత చేసియుంచుమనియు చెప్పి వారు వెళ్లిరి. శ్రమపడి ఆ కాగితము లన్నిటిని యిచ్చుటకు యత్నించితిని. కాని కొన్ని దొరకనందున తక్కినవానిని శ్రీరామశాస్త్రిగారు మరల నావద్దకు వచ్చినపుడు ఇచ్చితని. ముఖ్యమైన కాగితములు, 1, 2 తప్ప తక్కినవన్నియు దొరకినందుకు వారు సంతృప్తిచెంది విజయనగరము సంస్థానముకేసు విశాఖపట్టణము కోర్టున విచారణకు వచ్చినపుడు నేనచ్చటికివచ్చి తప్పక సాక్ష్యమివ్వవలెనని నొక్కి చెప్పిరి. కోర్టున సాక్ష్యమిచ్చుటకు నా కలవాటులేనందున నన్ను తొలగింపమని యెంత చెప్పినను వారు వినరైరి. కేసు విచారణకు వచ్చుటకు ముందు సాక్షి సమ్మను వచ్చుననియు, మదరాసు నుండి రాకపోకలకు రైలుఖర్చులేగాక బత్తాకూడ నిప్పింపబడుననియు చెప్పిరి. నేను నిశాఖపట్టణమునకు రాగానే ఏయంశములగూర్చి నేనెట్లు సాక్ష్య మివ్వవలెనో ఆసందర్భములను తానుగాని, యితర వకీళ్లు గాని నాకు బోధపరతురని శ్రీశాస్త్రిగారు చెప్పి