పుట:Sri-Srinivasa-Ayengar.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

పంజాబుఅల్లరులు కాగానే ఇండియాగవర్నమెంటువిధిలేక లార్డు హంటర్ యాజమాన్యమున ఒక కమీషను నిర్మించెను. ఇందుకు ముందుగ కాంగ్రెసువారు శ్రీ సి. ఆర్. దాసు, శ్రీగాంధీ, జస్టిస్ తయాబ్జి మున్నగువారిని ఒక కమిటీగానిర్మించి పంజూబు దురంతముులగూర్చి విచారణసాగింప నేర్పాట్లుగావించిరి కాని శ్రీ సి. ఆర్. దాసుగారు బడిరి హంటర్ కమిటీన సాక్షుల పరీక్షించుటకై ఆదేశింప కావున శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారు కాంగ్రెసు విచారణకమిటీసభ్యులైరి. ప్రతిరోజు 10 గంటలు మొదలు 4 గంటలవరకు హంటర్ కమిటీ సాగుటయు, ఆమీద 5.30 మొదలు 7 గం!! వరకు అమృతసరము సిక్కు దేవాలయమున కాంగ్రెసు విచారణకమిటీ సాగుటయు తటస్థించెను. రెండు కమిటీలకును శ్రీమా౯గారు హాజరగుచుండిరి. కాంగ్రెసు కమిటీ విచారణలో వీరు ప్రాముఖ్యత వహింపవలసివచ్చెను. ఈరెండు కమిటీలకు నన్ను వెంటరమ్మని వీరు కోరినందున నేనును వెళ్లుచుంటిని. హంటర్ కమిటీన నాకు పనిలేదు కావున అప్పుడప్పుడు మోటారు కారున నేను విశ్రాంతిపుచ్చుకొనుచుంటిని. కాంగ్రెసు