పుట:Sri-Srinivasa-Ayengar.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

147


తాము కొంత విద్యనేర్చి తక్కినకులముల వారితో సమాన ప్రతిపత్తి కావలెనని కోరినచో ఇందుకు నెవరును అడ్డురారు. కాని పైవారిని వీరికి అనుకూలములను గల్పింపుమని పోద్బలపరచినచో అస్పృశ్యత యెన్నటికిని తొలగదని నాకు తోచుచున్నది. ఏజాతివారు కాని కులమువారుకాని తాము భారత పుత్రులని భావింపవలెనేగాని విభేదములను పాటించుటచే దేశము ఔన్నత్యము పొందదని గుర్తింపవలెను. ఇంగ్లాందున ఆంగ్లేయులు, స్కాట్లండువారు, వేల్సువారు కలరు కాని రాజకీయవ్యవహారములలో వీరందరు ఏకముగ వర్తించుచు వారి స్వభాషలను, ఆచారవ్యవహారములను కాపాడుకొనుచున్నారు. ఇదేమోస్తరుగ భారతీయులు వర్తింప యత్నింపవలెను.

దక్షిణాఫ్రికాలో శ్రీగాంధీగారు అస్పృశ్యతను తొలగించునట్లు భారతీయు లనేకులు తలచుట పొరబాటు. శ్రీ లాలా లజపతిరాయి, శ్రీ గోక్లే మున్నగు మహనీయుల మాటలను పెడచెవినిబెట్టి శ్రీగాంధీగారు జనరల్ స్మట్సుతో గావించుకొన్న ఒడంబడిక ఫలితముగ తెల్లవారున్నచోట నల్లవా