పుట:Sri-Srinivasa-Ayengar.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


రుండరాదని దక్షిణాఫ్రికా వాసులు పట్టుబట్టి యున్నారు. ఎంతోకాలముగ అచ్చట యుంటున్న హిందూమహమ్మదీయులు త్వరలో ఇండియాకు ప్రయాణము కావలెనని యేర్పడెను. కావున జుతిమత విభేదములకు ప్రాముఖ్యత నిచ్చినచో భారతీయులు ఆధోగతి పాలగుదు రనుటకు సందేహములేదు. నేడు గాకున్నను అచిరకాలమున మనకు స్వాతంత్ర్యము లభించును. కావున సామాన్యవిభేదములను గొప్ప గావించినచో భారతదేశము అభివృద్ధి చెందజాలదు. శ్రీగాంధీగారు మతమును రాజకీయ వ్యవహారములతో ముడిపెట్టుటచే దేశముసకు అనేక కష్టనష్టములు నేడు సంభవించెను. టర్కీన కెమల్ పాషా మతమును దూరముగబెట్టి రాజ్యాంగ వ్యవహారములలో వీని కేజోక్యము లేక చేసినందుచే టర్కీ భావిస్థితి చక్కబడెను, నేటి పరిస్థితిలో యేసిద్ధాంతములకు చోటులేదు. కొందరికి స్వాతంత్ర్యము లభించినను అది నిష్ప్రయోజనము. భారతదేశ స్వాతంత్ర్యమే మన లక్ష్యముగానుంచుకొని రేయింబవళ్లు పాటుపడినగాని మనము మనదేశము అత్యున్నతస్థితికి రాదని మరల విన్నవించుచున్నాను.