పుట:Sri-Srinivasa-Ayengar.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


కొనుటకు సర్కారు ఉద్యోగముల నపేక్షించు చున్నారు. నౌకరులు యెల్లప్పుడును దాస్యమునకే కాని దేశస్థితిగతి చక్కబడుటకు తోడ్పడరు.

ఇకముందు కాంగ్రెసు మంత్రులకును, ఇతరకక్షలవారి మంత్రులకును ఏలాటి భేదముండదు. కావున వీరిలో నెవరుకాని జాతీయాదర్శములకు విరుద్దముగ పర్తింప నవకాశముండదని అందరును గుర్తింపవలెను. ఈమంత్రులు ఏవియో కొద్దిశాసనములను గావింప వీలగునే కాని దేశాభివృద్ధికి అనువగు శాసనములను గావింప వీరికి ఏమాత్రము వీలుండదు. ప్రజాప్రతినిధులసంఖ్య శాసనసభలలో హైచ్చగును కావున ప్రజాభీష్టములను నెరవేర్చుటకు ఇకముందు కొంత అవకాశముగలదు. పదవులను స్వీకరించుటవల్ల ఏ ప్రయోజనములేదని శాసనసభ్యులు గుర్తించి ప్రజాశయములను అమలునబెట్టుటకు నిరంతరము పాటుపడవలెను. హిందూమతము ఇతర మతములకన్న గొప్పదికావున సంస్కృతమున చక్కనిఅభినివేశము గల వేదాంతులు జాతిమతవిభేదములను పాటింపక వ్యవహరించెడివారని మన ప్రాచీనచరిత్ర దృగ్గోచరముగావించుచున్నది. అస్పృశ్యులు తమంతట