పుట:Sri-Srinivasa-Ayengar.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

145


ఓడలు, నౌకలు విదేశములకు నెమ్మదిగ వర్తకము సాగించుటయేగాక ఎచ్చటనైన పోరాటము సంభవించినప్పుడు అందు పాల్గొని భారతీయులలో ముఖ్యముగ మహారాష్ట్రులు విజయమొందినట్లు తెలియుచున్నది. భారతదేశచరిత్రను భాతీయులే సమగ్రముగ వ్రాసినగాని ప్రజలలో దేశభక్తి ఏర్పడదనియు, ముఖ్యముగ పాఠశాలలలోను కళాశాలలలోను భారతీయ ప్రాచీనఔన్నత్యమును సూచించు పుస్తకములను యువకులు చదుపునట్లుజేయుట దేశీయనాయకుల విధియనియు తలచుచున్నాను. జపానువంటి చిన్న దేశము, చైనావంటి పెద్దదేశము తమ దేశసంరక్షణకై ఇటీవల అన్నిఏర్పాట్లను గావించుకొన్నపుడు మనము యేల ఊరకుండవలెనని నేను ప్రశ్నించుచున్నాను. ఎవరుకాని వారిదేశమును సంరక్షించుకొను సామర్థ్యములేనిచో అట్టి దేశమునకు స్వాతంత్ర్యము లభించినను నిష్ప్రయోజనమనునది నా దృఢనమ్మకము.

ప్రభుత్వోద్యోగములు:- భారతీయులలో ఆంగ్ల విద్యగడించినవారు అనేకులు బీదలుగావున ప్రభుత్వాదాయమువల్ల పేదరికమును పోగొట్టు